Ravindra Jadeja Imitates Kuldeep: క్రికెట్ మైదానంలో బ్యాట్, బాల్‌తో మ్యాజిక్ చేయడం ఒకెత్తైతే.. మైదానం వెలుపల సహచర ఆటగాళ్లను ఇమిటేట్ చేస్తూ అల్లరి చేయడం రవీంద్ర జడేజా (Ravindra Jadeja) లెవెలే వేరు. ఇండియా వర్సెస్ శ్రీలంక XI ప్రాక్టీస్ మ్యాచ్ సమయంలో జడేజా తనలోని అసలైన కమెడియన్ బయటకు తీశాడు. డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీలో కూర్చుని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) బౌలింగ్ యాక్షన్‌ని అచ్చం అలాగే దించేసి నవ్వులు పూయించాడు.
కుల్దీప్ యాక్షన్‌లో అంత స్పెషాలిటీ ఏంటీ?:
కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కి వచ్చేటప్పుడు పిచ్ వైపు పరిగెత్తే తీరు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. క్రీజ్ దగ్గరకు వచ్చేటప్పుడు అతను చేతులను గాల్లో ఊపుతూ.. సరిగ్గా గాల్లో ఈత కొడుతున్నట్లు (Swimming in the air) హడావిడి చేస్తుంటాడు. ఈ చిన్న క్యూరియస్ మూవ్‌మెంట్‌ని పక్కాగా పట్టేసిన రవీంద్ర జడేజా.. సేమ్ టూ సేమ్ అదే స్టైల్లో ప్రాక్టీస్ చేసి చూపించి పక్కనే ఉన్నవాళ్లని కూడా తెగ నవ్వించేశాడు.
గంభీర్‌ని కూడా నవ్వించేశాడుగా:
సాధారణంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఎంత పెద్ద కామెడీ సీన్ జరిగినా, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా మహా మునిలా స్ట్రిక్ట్‌గా కూర్చుంటాడు. కానీ, ఈసారి జడేజా వేసిన కామెడీ పంచ్‌కి గంభీర్ కూడా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అంటేనే అర్థం చేసుకోవచ్చు.. జడ్డూ భాయ్ ఎంతలా జోక్స్ చేసాడో అనేది. జడేజా ఆటిట్యూడ్, కుల్దీప్ వాకింగ్ని కలిపి కొట్టిన మిమిక్రీ షో చూసి గంభీర్ గట్టిగా నవ్వుతూ ఎంజాయ్ చేశాడు. గౌతమ్ అంతలా నవ్వడం చాలా అరుదుగా చూస్తాం కాబట్టి.. ఈ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. జడేజా భయ్యా.. నీ కామెడీకి దండం పెట్టాలి అంటూ నెట్టింట ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Jadeja mimicking Kuldeep 😂
— Kaushy (@kaushyy14) August 8, 2026
Wait For Gambhir Reaction #INDvsSL #TestCricket #CricketIndia #RavindraJadeja #TeamIndia pic.twitter.com/Mg1T0NLMQG
